హైదరాబాద్(రైట్స్ మీడియా):
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.