Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

హనుమకొండలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటుపై సమీక్ష

⏩ ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, GWMC ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న తో కలిసి సమీక్ష.

హనుమకొండలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటుపై సమీక్ష
Share Short Clip Download PDF

హనుమకొండ నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్, GWMC ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, సిటీ ప్లానర్ రవీంద్ర రెడేకర్ లతో ఎమ్మెల్యే మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.

హనుమకొండలోని అశోక జంక్షన్ సమీపంలోని ఉన్న మున్సిపల్ స్థలంలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై సమావేశంలో ఎమ్మెల్యే చర్చించారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కన్సల్టెంట్ ప్రతినిధులు పాల్గొని హనుమకొండలో ఏర్పాటు చేయనున్న మల్టీ లెవెల్ కారు పార్కింగ్ గురించిన ప్రతిపాదనలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతిపాదిత స్థలంలో పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలకు పరిష్కారం లభించనుంది.

హనుమకొండలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటుపై సమీక్ష