Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నడికూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్ల పరిశీలన

నడికూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్ల పరిశీలన
Share Short Clip Download PDF

పరకాల/నడికూడ (రైట్స్ మీడియా): పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచనల మేరకు, హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య నూతనంగా నిర్మించిన నడికూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు త్వరితగతిన ఓపీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన సదుపాయాలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్య సేవల పర్యవేక్షణ

జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది హాజరు, వైద్య సేవల నిర్వహణను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పరకాల పరిధిలోని రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మొత్తం 25 మందికి గాను 11 మంది గైర్హాజర్ హాజరైనట్లు గుర్తించారు. అలాగే కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కనపర్తి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో మొత్తం 10 మందికి గాను 6 మంది గైర్హాజర్ హాజరైనట్లు పరిశీలనలో గుర్తించారు.

సిబ్బంది కొరత కారణంగా సాధారణ ప్రజలకు వైద్య సేవలు నిలిచిపోకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు డాక్టర్ అప్పయ్య గారు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర వైద్య సేవలు, ఓపీ సేవలు మరియు ఇతర కీలక ఆరోగ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం అందేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ దివ్య, mpheo రాజ కుమార్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్య సేవల పర్యవేక్షణ

Source / reference: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, హనుమకొండ జిల్లా.