Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

మానసిక దివ్యాంగులను పెంచడం చెప్పినంత సులభం కాదు.. కానీ తలుచుకుంటే అది పెద్ద కష్టం కూడా కాదు

⏩ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని.

మానసిక దివ్యాంగులను పెంచడం చెప్పినంత సులభం కాదు.. కానీ తలుచుకుంటే అది పెద్ద కష్టం కూడా కాదు
Share Short Clip Download PDF

నిజామాబాద్(రైట్స్ మీడియా): జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ మరియు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని మాట్లాడుతూ

మానసిక దివ్యాంగులను పెంచడం చెప్పినంత సులభం కాదు కానీ తలుచుకుంటే అది పెద్ద కష్టం కూడా కాదు. చాలామంది దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలతో మేము పోరాడుతున్నామనుకోవద్దు వారిని ఆదుకోవడానికి మరియు సేవ చేయడానికి స్నేహ సొసైటీ లాంటి సంస్థలు మరియు సమాజం మీకు అండగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దన్నారు. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి ఎవరో ఒక రూపంలో మన దగ్గరకు పంపిస్తాడు. అలాగే దేవుడు సిద్దయ్య జ్యోతిల రూపంలో మీ పిల్లల సహాయం కోసం పంపించాడన్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో అవగాహన లేని రోజుల్లో ఒక మానసిక వికలాంగుల పాఠశాల ఏర్పాటు చేయాలంటే సిద్దయ్య జ్యోతిలు ఎంతో శ్రమపడి ఉంటారని తెలిపారు. వారి శ్రమకు ఫలితమే నేడు అనేకమంది దివ్యాంగులు విద్యను ఇతర సేవలను అందుకో గలుగుతున్నారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులను నేను కోరేది ఒకటే మీరు ఎవరైనా వికలాంగులు చూస్తే వారికి తప్పకుండా సలహాలు ఇచ్చి వారిని ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించండని సూచించారు. దానివల్ల ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. నేను జిల్లాలో చాలామంది దివ్యాంగ బాలలు వారికి ఉన్న వైకల్యం కాక ఇతర వైకల్యం కలిగిన సర్టిఫికెట్లు పొందారని వాటిని పిలిపించి వారికి సరైన సర్టిఫికెట్లు అందేలా సహాయం చేస్తానని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని మాట్లాడుతూ

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ విశాల్, మానసిక వైద్యశాఖా ధిపతి, మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ దివ్యాంగ బాలలను అతి చిన్న వయసులోనే గుర్తించి వారిని ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించడం ద్వారా లేదా వారికి సరి అయిన శిక్షణ అందించడం ద్వారా వారిలో వైకల్యం పెరగకుండా కాపాడుకోవచ్చన్నారు. మహిళలు గర్భిణీలుగా ఉన్నప్పుడు వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉపసంచాలకులు పురుషోత్తమ నాయక్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ, స్నేహ సొసైటీ కార్యదర్శి, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, టాటా ఇన్సూరెన్స్ మేనేజర్ సాయిరాం, వైద్య ఆరోగ్య శాఖాధికారి రాజశ్రీ, బాలాజీ, సత్యనారాయణమూర్తి, సుమన్, మానసిక దివ్యాంగుల తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Nizamabad.