సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో పర్యాటక శాఖ వివిధ కార్యక్రమాల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఈ నెల 27న నిర్వహించే ప్రపంచ దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు, నిర్వహణపై పర్యాటక, విద్యా, పురావస్తు, అటవీ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయండి
⏩హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.
⏩హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 27న నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు, నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
చారిత్రక ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. యువ టూరిజం క్లబ్ లో నమోదయి ఉన్న విద్యార్థులకు పర్యాటక, వారసత్వ సంపద పై మండల, జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రలేఖన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని డీఈఓ,డిఐఈఓలకు సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఉదయం 6:00 గంటలకు హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో యోగ కార్యక్రమాలు, 25వ తేదీన హనుమకొండ పద్మాక్షి జైన దేవాలయం, సిద్దేశ్వరాలయం వద్ద హెరిటేజ్ వాక్ ను పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని పేర్కొన్నారు.
హెరిటేజ్ వాక్ లో యువ టూరిజం క్లబ్ విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. 26వ తేదీన ఉదయం 7 గంటలకు తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా యువ టూరిజం క్లబ్ విద్యార్థులకు జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా చేపట్టే కార్యక్రమాలను ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా అటవీ శాఖ అధికారి ముకుంద రెడ్డి, డీఈవో గిరిరాజ్ గౌడ్, హనుమకొండ ఏసీపీ నరసింహ రావు, అడిషనల్ డీఆర్డీఏ వెంకటేశ్వర్లు, జీడబ్ల్యూఎంసి సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఇరిగేషన్ ఈఈ మంగీ లాల్, డీఐఈవో గోపాల్, కేంద్ర పురావస్తు అధికారి అజిత్ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారి శ్రీనివాస్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.