జపాన్‌లోని ఐచి-నగోయాలో 2026 ఆసియా క్రీడలు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. ఇందులో 45కి పైగా దేశాలు మరియు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు 43 క్రీడాంశాలలో పోటీపడనున్నారు.

రికార్డు స్థాయి ప్రదర్శన లక్ష్యంగా, జపాన్‌లోని ఐచి-నగోయాలో 2026 ఆసియా క్రీడలు ఈ రోజు అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. ఆసియా క్రీడల యొక్క ఈ 20వ ఎడిషన్‌లో, 45కి పైగా దేశాలు మరియు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు 43 క్రీడాంశాలలో పోటీపడనున్నారు. భారత్ తరపున 500 మందికి పైగా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ బృందంలో 36 క్రీడా విభాగాలకు చెందిన 267 మంది పురుష మరియు 232 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు.
గత హాంగ్‌జౌ ఆసియా క్రీడలలో, భారత్ 106 పతకాలతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియా తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది.