తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను భాగస్వామ్యం చేస్తూ దేశంలోనే అతిపెద్ద హ్యాకథాన్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ మరియు టీ-హబ్, హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, రూసా నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని టీ-హబ్ సీఈఓ కవిక్రుత్‌ను కలిశారు. ఈ సందర్భంగా హ్యాకథాన్‌ను విస్తృత స్థాయిలో నిర్వహించడం, తెలంగాణలోని అన్ని జిల్లాలను భాగస్వామ్యం చేయడం, విద్యార్థులు, యువత, సాంకేతిక నిపుణులకు విస్తృత అవకాశాలు కల్పించడం తదితర అంశాలపై చర్చించారు.
హ్యాకథాన్‌ను అధికారికంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కూడా భాగస్వామ్యం కానుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు, యువత, సాంకేతిక ప్రతిభావంతులు పాల్గొని తమ ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ఈ హ్యాకథాన్ ఒక విశిష్ట వేదికగా నిలవనుంది.
దేశంలోనే అతిపెద్ద హ్యాకథాన్‌కు సన్నాహాలు
• కాకతీయ విశ్వవిద్యాలయం–టీ-హబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.
కేయూ వీసి ఆచార్యులు కే. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ
కాకతీయ విశ్వవిద్యాలయం–టీ-హబ్ సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక హ్యాకథాన్ ద్వారా తెలంగాణలోని విద్యార్థులు, యువతలో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆవిష్కరణల స్ఫూర్తిని ప్రోత్సహించడంతో పాటు, స్టార్టప్‌లకు తమ వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులు మరియు సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించేందుకు, పరిశ్రమ నిపుణులతో అనుసంధానం ఏర్పరచుకునేందుకు, తమ ఆవిష్కరణలను తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక విస్తృత వేదికను కల్పించనున్నారు. భవిష్యత్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ప్రతిభను వెలికితీయడం, యువ ఆవిష్కర్తలు మరియు స్టార్టప్‌లను ప్రోత్సహించడం ఈ హ్యాకథాన్ ప్రధాన లక్ష్యంగా ఉండనుందని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ స్కిల్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ రియా సైమన్, సియెంట్ టెక్నాలజీస్ ప్రతినిధులు కృష్ణాదవి, గీత తదితరులు పాల్గొన్నారు.