నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 25/11/2025 రోజు నమోదైన హత్య కేసులో నిందితుడికి నాల్గవ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి (ఫ్యామిలీ & ఉమెన్స్ కోర్టు), నిజామాబాద్ డి. దుర్గ ప్రసాద్ బహిరంగ న్యాయస్థానంలో తీర్పు వెలువరించి జీవిత ఖైదు విధించారు.
బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు...
• నాల్గవ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి (ఫ్యామిలీ & ఉమెన్స్ కోర్టు).
• నేరాలకు పాల్పడే వారికి చట్టపరమైన పరిణామాలు తప్పవు: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
కేసు వివరాల్లోకి వెళితే..
నవీపేట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 307/2025, SC No.130/2026, సెక్షన్లు 103(1), 303(2) BNS కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతురాలు ఆకుల అనంత @ సోనీ, D/ మల్కాపూర్ గ్రామం, నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన గృహిణి హత్య కేసులో నిందితుడిగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మోస్రా కు చెందిన 37 ఏళ్ళ కుమురం @ పాండవాల సాగర్ కేసులో నిందితుడన్నారు. నిందితుడు మృతురాలికి బంధువు కావడంతో ఆమె ఇంటికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో మృతురాలి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను గమనించిన నిందితుడు, వాటిని దొంగిలించాలనే ఉద్దేశంతో మృతురాలి తల్లి ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి, మృతురాలిని గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం బంగారు ఆభరణాలను అపహరించినట్లు ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నార్త్ రూరల్ నిజామాబాద్ బి. శ్రీనివాస్, నవీపేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సహాయంతో ఆధారాలను సమర్థవంతంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసారని తెలిపారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించిందని పోలీసు కమీషనర్ తెలిపారు.
నిందితునికి BNS సెక్షన్ 103(1) కింద జీవిత ఖైదు మరియు రూ.5,000/- జరిమానా. జరిమానా చెల్లించని పక్షంలో 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది..
BNS సెక్షన్ 303(2) కింద 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు 2,000/- జరిమానా విధించింది.. జరిమానా చెల్లించని పక్షంలో 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది..
పై రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పింది.
ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. నీరజ ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు.
నేరాలకు పాల్పడే వారికి చట్టపరమైన పరిణామాలు తప్పవు: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడే విధంగా బలమైన కేసును కోర్టు ముందు నిలబెట్టిన నార్త్ రూరల్ నిజామాబాద్ బి. శ్రీనివాస్ నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కేసులో FIR నమోదు చేసి ప్రారంభ దర్యాప్తు నిర్వహించిన SI నవీపేట్ సి. తిరుపతి, దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన CIP బి. శ్రీనివాస్, కోర్టు లైజన్‌లో సమన్వయం చేసిన టీ. గోవింద్, కోర్టు సిబ్బంది K. చంద్రశేఖర్, K. గణేష్, మరియు నవీపేట్ CDO M. సుప్రియ, రైటర్స్ ఆర్. శ్రీకాంత్ గౌడ్ , దత్తాద్రి గౌడ్, సిహెచ్ నాగరాజు లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.
నేరాలకు పాల్పడే వారికి చట్టపరమైన పరిణామాలు తప్పవని, బాధితులకు న్యాయం జరిగేలా నిజామాబాద్ పోలీస్ శాఖ సమర్థవంతమైన దర్యాప్తు మరియు కోర్టు పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.