నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు దారుల నుండి 31 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను కూలంకషంగా విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు.