Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

జిల్లాలో త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

⏩యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.

జిల్లాలో త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
Share Short Clip Download PDF

మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డు పరిధిలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని సంబంధిత మిషన్ భగీరథ, ఇంట్రా, గ్రిడ్, స్థానిక సంస్థలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు (ఎల్నినో) నేపథ్యంలో సాగునీరు, త్రాగునీరు సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో ఉన్నటువంటి ఓహెచ్ఆర్ (1477) ద్వారా , ఇతర వలరుల ద్వారా త్రాగునీరు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలుపరచాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.

ఇంకా నీరు అందని గ్రామాలు పట్టణాల వివరాలను వెంటనే ఇవ్వాలని, వారికి ఇతర వనరుల ద్వారా త్రాగునీరు అందించాలని, నిత్యం అప్రమత్తంగా ఉంటూ స్వచ్ఛమైన నీరు వచ్చే విధంగా మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా, గ్రామపంచాయతీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సుదీర్ఘంగా కలెక్టర్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పీడీ పురుషోత్తం, మిషన్ భగీరథ ఈ ఈలు బి.మాణిక్యరావు, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.