Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

చిన్న వడ్డేపల్లి చెరువులో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం: కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి

⏩ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు... గణనాథునికి ఘనంగా వీడ్కోలు.

చిన్న వడ్డేపల్లి చెరువులో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం: కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి
Share Short Clip Download PDF

⏩కొబ్బరికాయలు కొట్టి నిమజ్జన వేడుకలను ప్రారంభించిన కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న.

వరంగల్‌లోని చిన్న వడ్డేపల్లి చెరువులో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత కొబ్బరికాయలు కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. భక్తులు తీసుకువచ్చిన గణపతి విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేశారు.

క్రేన్ సహాయంతో కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీసీపీ కవిత చెరువులో ఏర్పాటు చేసిన నీటితెప్పలపై దిగి విగ్రహాలను స్వయం గా నిమజ్జనం చేయడంతో పాటు....నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ...

చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. చిన్న వడ్డేపల్లి చెరువుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2500 విగ్రహాలు నిమజ్జనానికి రానున్నాయని పేర్కొన్నారు. దీనితో పాటు కుడా పరిధిలో ఉన్న అన్నీ నిమజ్జన పాయింట్ ల వద్ద అధికారులు తగు ఏర్పాట్లు చేసారన్నారు. వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు విధులు నిర్వహిస్తున్న పోలీస్, రెవిన్యూ, GWMC, కుడా,విద్యుత్, ఇరిగేషన్, మత్స్య శాఖ, ఆర్ అండ్ బి, ఫైర్ తదితర అన్నీ శాఖల అధికారులను కుడా చైర్ పర్సన్ అభినందించారు

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణనాథుల విగ్రహాలను భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు, కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్దకు తీసుకురాగా క్రేన్ల సహాయంతో ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పల్లో చెరువు నీటిలో నిమజ్జనం చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. నిమజ్జన ప్రాంతంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

భక్తులు ప్రశాంత వాతావరణంలో గణనాథుడి నిమజ్జన వేడుకలను నిర్వహించుకునేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.