కాకతీయ విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 26న హ్యుమానిటీస్ బిల్డింగ్‌లోని సెమినార్ హాల్‌లో నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ పోస్టర్‌ను బుధవారం ప్రభుత్వ పాలన మరియు మానవ వనరుల విభాగాధిపతి ప్రొఫెసర్ పెదమళ్ల శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ పెదమళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు ఈ మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్ డైరెక్టర్ డా. చిర్ర రాజు మాట్లాడుతూ, ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో హర్షిత్ గ్రూప్, మెహత ఇండస్ట్రీస్, అవొగ్య సొల్యూషన్స్ తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డా. సంకినేని వెంకటయ్య, డా. మామిడి లింగయ్య, డా. చీకటి శ్రీను, డా. బుర్రి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.