ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అన్నారు. ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9 బుధవారం ఉదయం 10.30 గంటలకు విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాళోజి నారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. విశ్వవిద్యాలయ బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఒక సర్క్యులర్‌ను విడుదల చేశారు.
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం