సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, డిఆర్ఓ నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, లీగల్ సెల్ అథారిటీ ప్రతినిధి అడ్వకేట్ ఆనంద్ కుమార్ లు కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
⏩ ప్రజలకు తక్షణ సేవలు అందించడం కోసమే డివిజన్, మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో ప్రజలకు మరింత అనేకంగా సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో డివిజనల్, మండల స్థాయిలలో పాటు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలలో దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. ప్రజలు చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేసి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహబూబాబాద్ మండలం జామాండ్లపల్లి గ్రామానికి చెందిన కొణతం లలిత తనకు చెందిన రిజిస్ట్రేషన్ గల భూమి 22 ఎ నిషేదిత ఆస్తుల జాబితాలో ఉన్నదని తన యాజమాన్యానికి సంబంధించిన దృవీకరణ పత్రాలు తన వద్ద ఉన్నాయని అధికారులు రికార్డులను పరిశీలించి 22 ఎ జాబితా నుండి తన భూమిని తొలగించాలని కోరారు. గార్ల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ దేవ్లా సీతారామ ప్రాజెక్ట్ క్రింద తన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారని అట్టి పరిహారం తన బ్యాంకు ఖాతాలో కాకుండా వేరొకరి బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందని అట్టి పరిహారాన్ని తనకు ఇప్పించగలరని కోరారు.
బయ్యారం మండలం జగత్రావు పేట కు చెందిన పాయం వాలమ్మ తనకున్న వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ తొ చదును చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు అట్టి భూమి ఫారెస్ట్ భూమని సాగుచేసుకునేందుకు వీలు లేదని అడ్డు కుంటున్నారని తనకు తగిన న్యాయం చేసి తన భూమిని సాగు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు.
ఈ సందర్బంగా ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన ( 120 ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి చేయాలన్నారు.
జిల్లాలోని జిల్లా, డివిజనల్ , మండల కేంద్రాల్లో నీ, ప్రతి ఒక్క ఉద్యోగి బయోమెట్రిక్ విధానం ద్వారా తమ ముఖచిత్రాలతో కూడిన హాజరు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, క్రమం తప్పకుండా సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని విభాగాల ప్రధాన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజల సౌకర్యం నిర్వహించే ఇంటర్నెట్ సౌకర్యాలను తెలంగాణ టి ఫైబర్ ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించినందున తమ కార్యాలయాలలో వర్క్ ఆర్డర్ వెంటనే ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం తొమ్మిదవ జాతీయ పోషణ మాసం మా అంగన్వాడి, మా బాధ్యత. సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 9 వరకు జరిగే కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ ప్రజావాణిలో డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, సిపిఓ,వి. శ్రీనివాసరావు, ఉద్యానవల్ల అధికారి జినుగు మరియన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ట్రైబల్, ఎస్సీ, బిసి సంక్షేమ అధికారులు దేశీ రామ్ నాయక్, శ్రీనివాసరావు, శ్రీజ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, జిఎం ఇండస్ట్రీ శ్రీమన్నారాయణ రెడ్డి, డిపిఓ రేవంత్, డిసిఓ, సర్దార్ సింగ్, ఎల్డీఎం యాదగిరి, ఇన్చార్జి వెల్ఫేర్ అధికారిని కె.శిరీష, డిఎస్ఓ రమేష్, డి ఎం సివిల్ సప్లై నరసింహారావు, ఎడి ల్యాండ్ సర్వే రికార్డ్స్ శ్రీనివాసులు, క్రీడల అధికారి జ్యోతి, ఎడి మైనింగ్ వెంకట రమణ, ఉపాధి కల్పనా అధికారి రజిత, మెప్మా డీఎంసి విజయ, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర, అడిషనల్ డిఆర్డిఓ మల్లీశ్వరి, జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్, ఇన్చార్జి డిఈఓ శ్రీరాములు, టిపిఓ సాయిరాం, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సూపర్డెంట్లు మదన్ గోపాల్, రాజేష్, దామోదర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.