Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

సూపర్ స్పెషాలిటీ పనులను వేగంగా పూర్తి చేయాలి: ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తూ

సూపర్ స్పెషాలిటీ పనులను వేగంగా పూర్తి చేయాలి: ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తూ
Share Short Clip Download PDF

వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తూ సోమవారం హనుమకొండకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపల్‌ సెక్రటరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్ని సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.