Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నర్సంపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

నర్సంపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
Share Short Clip Download PDF

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

అప్పటి కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో చేపట్టిన సైనిక చర్య అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ఈ చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబీ వంశీ, వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.