కలలు సంస్కృతిని పరిరక్షిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్న సాంస్కృతిక గురువులను సత్కరించేందుకు రోటరీ క్లబ్ హైదరాబాద్ మెగాసిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ టీచర్స్ ఫెలిస్ట్రేషన్ కార్యక్రమంలో హుజురాబాద్ కు చెందిన సీనియర్ జానపద కళాకారుడు డాక్టర్ విష్ణు దాస్ గోపాల్ రావుకు సాంస్కృతిక గురువుకు ఇచ్చే అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 19న శనివారం హైదరాబాద్ మాదాపూర్ లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ రీజినల్ సెంటర్లో ఈ అవార్డు ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు గుండ్ర రోజు తెలిపారు. గోపాల్ రావు గత 52 సంవత్సరాలుగా కళా రంగంలో అనేక సేవలందిస్తూ కళా రవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ ద్వారా గత 25 సంవత్సరాలు పైబడి అనేకమంది కళాకారులను గుర్తించి వారి సంస్థ ద్వారా కార్యక్రమాలు ఇప్పిస్తూ వారిని ఘనంగా సత్కరిస్తూ వారికొక మంచి గుర్తింపు తెస్తున్నటువంటి గోపాల్ రావు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చిన సీనియర్ కళాకారులు గోపాల్ రావు. వారికి యూనివర్సిటీ నుండి డాక్టరేట్, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు, అచీవ్మెంట్ అవార్డు, 6 ప్రపంచ గిన్నిస్ రికార్డులు, పలు జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ. అంతర్జాతీయ. స్థాయిలో అవార్డులను అందుకున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా ఢిల్లీ అండమాన్ నికోబార్ కువైట్ లండన్ అమెరికా లాంటి ప్రదేశాలలో వారి గళం విప్పి అందరిని ఆకట్టుకున్న గోపాల్ రావు. జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంలో గోపాలరావు యాంకర్ గా కళాకారునిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఒక గొప్ప వ్యక్తి గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న గోపాల్ రావు. గురువులకు ఇచ్చే అవార్డు ఎంపి క కావటం పట్ల గోపాల్ రావు స్పందిస్తూ.. నన్ను గుర్తించి ఒక గురువుగా నాకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ అవార్డు ప్రధానం చేస్తున్న రోటరీ క్లబ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గోపాలరావు వెల్లడించారు.
అంతర్జాతీయ అవార్డుకు డా. విష్ణుదాసు గోపాల్ రావు ఎంపిక