Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమం

పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. హైమావతి దిశ నిర్దేశం చేశారు.

పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమం
Share Short Clip Download PDF

హుస్నాబాద్ నియోజకవర్గం జిల్లాలో 3 మండలాలోనీ గ్రామాల్లో త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించబోయే పల్లె పల్లె కు పొన్నమన్న, పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమ ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా ఆయా శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

హుస్నాబాద్ నియోజకవర్గ 3 మండలాలు కోహెడ, అక్కన్న పేట, హుస్నాబాద్ మండలంలో పల్లె పల్లె కు పొన్నమన్న, పల్లె పల్లెలో ప్రజాపాలన ద్వారా రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామంలో ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం నుండి ప్రజలకు అందుతున్న పథకాలు మరియు గ్రామాల్లో సమస్యలు గూర్చి నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించనున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతిలో సభ ఏర్పాటు టెంట్, కుర్చీలు, సౌండ్ సిస్టమ్, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎంపీడీవోలు ఆదేశించారు. శాఖల అధికారులు గ్రామాల్లో సభలో తెలిపిన దరఖాస్తులను నోట్ చేసుకుని, ఏ స్థాయిలో పరిష్కరించవచ్చు ప్రతిదీ రికార్డు చేసుకుని, ఫైలింగ్ చేసుకోవాలని ఏంపిడిఓ లను ఆదేశించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు వివరాలు, కొత్త రేషన్ కార్డులు సభ్యుల చేర్చిన వివరాలు, గ్యాస్ సబ్సిడీ, సన్నబియ్యం పంపిణీ మరియు సన్నవడ్లకు బోనస్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా లబ్ధిదారులు, రైతు భరోసా మరియు రైతు బీమా పథకాలు లబ్ధిదారులు, కళ్యాణ లక్ష్మీ శాదిముబారక్ చెక్కులు, వడ్డీలేని రుణాలు పంపిణీ, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన వివరాలతో జాబితా తయారు చేసి గ్రామ సభలో పెట్టాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
గ్రామంలో శాఖల వారిగా శాంక్షన్ అయిన పనులు, పనుల పురోగతి గూర్చి శాఖల వారిగా సమీక్ష జరుపుతారు. ప్రతి పనికి ఒక నిర్ణిత కాలం పెట్టీ, ఆ నిర్ణిత కాలవ్యవధిలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. గ్రామంలో ప్రాధాన్యత అంశాలు డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్స్ ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా తేలుకోవాలని ఆదేశించారు. హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి ఈ ప్రోగ్రామ్ గురించి ప్రతి గ్రామం మానిటర్ చేస్తూ, కార్యక్రమం విజయవంతం చెయ్యాలని ఆదేశించారు.