తమిళనాడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన 31వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పాల్గోన్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి వీడి సతీషన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, అంతర్రాష్ట్ర సమన్వయం, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అవసరమైన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.