తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు కావస్తున్నా నేటికీ విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిలేక విద్యార్థుల సమస్యలు పట్టించుకునేనాథుడే లేకుండాపోయిందని, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను సాంకేతిక విద్యాశాఖ నుండి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నాడని,సాంకేతిక విద్యా శాఖ లోనే కొనసాగించాలని సిద్దిపేట లో ఉమేన్స్ పాలిటెక్నీక్ కళాశాల విద్యార్థులు ధర్నా కు బిఆర్ఎస్ విద్యార్తి విభాగం నాయకులు మద్దతు పలికారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు ఏడు దశాబ్ధాల సుదీర్ఘ ఘన చరిత్ర ఉందని, ఎందరో నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యనభ్యసించి దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 95% మంది నిరుపేద విద్యార్థులు నామమాత్రపు కళాశాల ఫీజు కట్టి నాణ్యమైన ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ స్థాయి విద్యను డిప్లొమా స్థాయిలోనే నేర్చుకుంటున్నారని ఇలాంటి పటిష్టమైన ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యాచట్టం పరిధి నుండి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ పబ్లిక్- ప్రైవేట్ పార్ట్నర్షిప్ చట్టం పరిధిలో చేర్చడం వలన నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయని తద్వారా పాలిటెక్నిక్ వ్యవస్థ పతనమవుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రభుత్వం ఎలాంటి ముందస్తు అభిప్రాయ సేకరణలు చేపట్టకపోవడం, ఇప్పటికీ స్పష్టమైన విధివిధానాలు బహిర్గతం చేయకపోవడం వలన ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సైతం తమ భవిష్యత్ గురించి అయోమయంలో ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ నిర్వీర్యానికి దారితీసే జీవో 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర మంత్రిమండలి అమోదించిన శక్తి శాఖలోకి పాలిటెక్నిక్ల విలీనం నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థకు అండగా నిలబడి శక్తి శాఖలోకి పాలిటెక్నిక్ల విలీనం బిల్లు చట్టబద్ధం కాకుండా ఎఐసీటీఈ ప్రమాణాలతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే ఎస్బీటీఈటీ బోర్డు పర్యవేక్షణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ యధాతతంగా కొనసాగేలా పోరాటంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థకు బాసటగా బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం అండగా ఉంటుందని వారు తెలిపారు. యథాతంగా కొనసాగె వరుకు పోరాటం ఆగదని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.