కోహెడ, అక్టోబర్ 6(రైట్స్ మీడియా): పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం పరివేద గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.