దేవరుప్పుల(రైట్స్ మీడియా): ధర్మగడ్డ తండాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి మూడ చందన దేవేందర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.