జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 29(రైట్స్ మీడియా): భవన నిర్మాణ సంబంధ నిబంధనలు ఖచ్చితం గా పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ టి .వెంకన్న స్పష్టం చేశారు. గురువారం నగరంలోని గొర్రెకుంట, విద్యుత్‌నగర్, నక్కలగుట్ట, సిద్ధార్థనగర్, గోపాల్‌పూర్, వడ్డేపల్లి, ప్రశాంత్‌నగర్ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ కోసం భవన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొలతలు తనిఖీ చేశారు.
నిబంధనలు పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ: బల్దియా కమిషనర్ టి.వెంకన్న
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019, సంబంధిత భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనుమతి పొందిన ప్లాన్ (నక్షా) ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పర్యటనలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టీపీఎస్‌లు ప్రశాంత్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.