▪️ దిల్ రాజు, సురేష్ బాబు, ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్లు నాగవంశీ, భరత్ భూషణ్, సెక్రటరీ అశోక్ కుమార్, ట్రెజరర్ ప్రసన్న కుమార్‌లకు ఫైనల్ లీగల్ నోటీసులు
▪️ PVR INOXకు చెందిన అజయ్ బిజిలీ, మేనేజర్ మహేష్, ఏసియన్ సినిమాస్ (Asian Cinemas) ఎండీ సునీల్ నారాజ్, మేనేజన్ ప్రశాంత్లకు కూడా ఫైనల్ లీగల్ నోటీసులు
▪️ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన షిరాజ్ మెహది
▪️ చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు..
▪️ వందలో 2-3 సినిమాలనే ప్రొజెక్ట్ చేస్తున్నారు
▪️ నా సినిమా వరకు నేను ఓడిపోను..
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, నెపోటిజం, మోనోపోలీపై ‘ఓ అందాల రాక్షసి’ నటుడు, దర్శకుడు షిరాజ్ మెహది (Sheraz Mehdi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎదురైన ఇబ్బందులే తనను న్యాయపోరాటం వైపు నడిపించాయని చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, PVR INOX ప్రతినిధులకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రికి కూడా ఫిర్మాదు చేసినట్టు తెలిపారు. స్పందన రాకపోతే తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.