Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

మహిళ పోలీస్ స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్...

⏩పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుతో మర్యాదగా ప్రవర్తించాలి.. ప్రతి ఒక్కరూ పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా కృషి చేయాలి: పోలీస్ కమీషనర్ సాయి చైతన్య...

మహిళ పోలీస్ స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్...
Share Short Clip Download PDF

నిజామాబాద్(రైట్స్ మీడియా): నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తదుపరి పోలీస్ స్టేషన్ లో చెట్లు నాటారు. అనంతరం సిబ్బందికి సంబంధించిన కిట్ ఆర్టికల్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తదుపరి పోలీస్ స్టేషన్ లో పూర్తిగా కలియతిరిగారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు.

మహిళలు , బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు త్వరితగతిన స్పందించి, బాధితులకు భరోసా కల్పిస్తూ , చట్టపరమైన నిబంధనల ప్రకారం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా బాధితులు తమ సమస్యలను ఎటువంటి భయాందోళనలు లేకుండా పోలీసులకు తెలియజేసే విధంగా వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు.

అదేవిధంగా మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి కేసును సున్నితమైన అంశంగా పరిగణిస్తూ , అవసరమైన ఆధారాలను సేకరించి, దర్యాప్తును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు , బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి , దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.

మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా , గౌరవంగా వ్యవహరిస్తూ , వారి సమస్యలను ఓర్పుతో విని , చట్టపరమైన పరిష్కారం చూపాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మహిళలు , బాలికల భద్రతకు సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
మహిళల భద్రత , రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు , మహిళలకు ఏవైనా సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.

అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని అన్నారు , దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని , సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.
నిజామాబాద్ ఏసిపి ప్రకాష్ , మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీలత, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఎమ్. డి రహమతుల్లా, పి. రాజేశ్వర్, పి. జాన్సన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మహిళ పోలీస్ స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్...

Source / reference: Senior Journalist Nakka Rakesh, Nizamabad.