కామారెడ్డి(రైట్స్ మీడియా): ఇంట్లో ఉన్న మహిళ కళ్లల్లో కారం చల్లి, ఆమె మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును అపహరించి పరారయ్యారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు..ఇంట్లో ఉన్న మహిళ కళ్లల్లో కారం చల్లి, ఆమె మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును అపహరించి పరారయ్యారు. దొంగలను అడ్డుకునేందుకు మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికి, దుండగుడు అక్కడి నుంచితప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అర్థరాత్రి దొంగల హల్ చల్... మహిళ కళ్ళల్లో కారం చల్లి, మెడలోని ఐదు తులాల బంగారు గొలుసు అపహరణ...