నిజామాబాద్ (రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని నిరసిస్తూ డిచ్ పల్లి మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఎంపీ అర్వింద్ భిక్షాటన చేశారు.
ఆర్వోబీ పనులు ఆలస్యాన్ని నిరసిస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మాధవనగర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్ష అనంతరం నిరసన దీక్ష కార్యక్రమానికి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. దీక్ష అనంతరం ఎంపీ అర్వింద్ భిక్షాటన నిర్వహించారు. బీజేపీ నాయకులు, ప్రజల నుంచి, అలాగే బైపాస్ నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల నుంచి ఆర్వోబీ కోసం నిధులు సమీకరించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.