Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వరంగల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ ఉపాధ్యక్షులు గా దోమ కుమార్ నియామకం

వరంగల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ ఉపాధ్యక్షులు గా దోమ కుమార్ నియామకం
Share Short Clip Download PDF

హనుమకొండ (రైట్స్ మీడియా): వరంగల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గా దోమ కుమార్‌ నియామకం అయ్యారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని సంబంధిత కార్యాలయంలో నియామక పత్రం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా దోమ కుమార్ మాట్లాడుతూ,

తనపై నమ్మకంతో ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వరంగల్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షులు గాదె లింగమూర్తి కి, ప్రధాన కార్యదర్శి అను సత్యం కి, దయాకర్ కి, కార్యనిర్వాక అధ్యక్షులు సునీల్ కుమార్ కి, అసోసియేషన్ డైరెక్టర్లందరికీ, తన తోటి ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రానున్న రోజుల్లో ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అసోసియేషన్ అభివృద్ధికి, సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఫోటో & వీడియో గ్రాఫర్లందరినీ సమన్వయం చేసుకుంటూ, వారి వృత్తిపరమైన అభివృద్ధికి మరియు ఐక్యతకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

తనకు ఈ బాధ్యతను అప్పగించిన అసోసియేషన్ పెద్దలు, సభ్యులు మరియు ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం మిత్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని దోమ కుమార్ వెల్లడించారు.

ఈ సందర్భంగా దోమ కుమార్ మాట్లాడుతూ,