Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

25 ఏళ్ల మోదీ సేవా ప్రస్థానం.. దేశమే ధ్యాసగా, ప్రజాసేవే శ్వాసగా సాగుతోంది

⏩బిజేఎల్పి ఫ్లోర్ లీడర్(BJLP Floor Leader), MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

25 ఏళ్ల మోదీ సేవా ప్రస్థానం.. దేశమే ధ్యాసగా, ప్రజాసేవే శ్వాసగా సాగుతోంది
Share Short Clip Download PDF

నిర్మల్(రైట్స్ మీడియా): నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం దేశమే ధ్యాసగా, ప్రజాసేవే శ్వాసగా సాగుతోందని బిజేఎల్పి ఫ్లోర్ లీడర్, MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలకు సేవ చేయడం, వారికి స్ఫూర్తినివ్వడం జరుగుతోందని, అందులో భాగంగానే నిర్మల్‌లో సేవా జ్యోతి కలశ యాత్రలో పాల్గొన్నామని తెలిపారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ ప్రయాణం, ప్రధానిగా దేశానికి నాయకత్వం వహించే స్థాయికి చేరడానికి ఆయనకు దేశం పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న బాధ్యతే కారణమని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

25 ఏళ్ల మోదీ సేవా ప్రస్థానం.. దేశమే ధ్యాసగా, ప్రజాసేవే శ్వాసగా సాగుతోంది

మొఘలులు, బ్రిటిష్ పాలనతో పాటు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వెనుకబడిన భారత్‌ను ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలిపేలా మోదీ పునర్నిర్మిస్తున్నారని అన్నారు. ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదాలు కోట్లాది మంది హృదయాలను తాకాయని, అందుకే దేశ చరిత్రలో వరుసగా మూడోసారి ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచారని తెలిపారు. మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. SIR ద్వారా దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తుంటే కాంగ్రెస్‌కు ఎందుకు ఇబ్బందిగా మారిందో చెప్పాలని నిలదీశారు. కర్ణాటక, తెలంగాణ, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో ప్రశ్నిస్తూ, గతంలో 7-8 సార్లు SIR జరిగినప్పుడు మాట్లాడని కాంగ్రెస్, ఇప్పుడు ఓటమి భయంతోనే 'ఓటు చోరీ' అంటూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

25 ఏళ్ల మోదీ సేవా ప్రస్థానం.. దేశమే ధ్యాసగా, ప్రజాసేవే శ్వాసగా సాగుతోంది

కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబం నుంచి ప్రధాని కావాలనే ధోరణితో పనిచేస్తే, మోదీ గారు ‘నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్’ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారని తెలిపారు. జన్ ధన్ యోజన ద్వారా డిజిటల్ విప్లవం తెచ్చారని, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12.11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడారని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ఫైటర్ జెట్ ఇంజిన్లు, ఆయుధాలు తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ను తీసుకెళ్లారని చెప్పారు. గతంలో తీవ్రవాద దాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ చేతులు ముడుచుకుని కూర్చుంటే, మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిందని గుర్తుచేశారు.

ఆయుష్మాన్ భారత్ ద్వారా 43.52 కోట్ల కార్డులు ఇవ్వడంతో పాటు, PM-KISAN ద్వారా 9.32 కోట్ల మంది రైతులకు ₹4.27 లక్షల కోట్లు బదిలీ చేశారని వివరించారు. తెలంగాణలో 22-A ప్రోహిబిటెడ్ లిస్ట్ పేరుతో లక్షలాది మంది ప్రజల ఇళ్లను, భూములను లాక్కుంటున్న పరిస్థితిపై అసెంబ్లీలో బిజెపి గట్టిగా గళమెత్తిందని, అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తానూ నిర్మల్ ప్రజలకు 'మహేశన్నగా' మాట ఇస్తున్నానని, మోదీ గారి ఆశీర్వాదంతో ఎన్ని కష్టాలు వచ్చినా, సవాళ్లు ఎదురైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసే వరకు వెనక్కి తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేశారు.

📄 Press Note