Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక సమీక్షా సమావేశం

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక సమీక్షా సమావేశం
Share Short Clip Download PDF

మహబూబాబాద్, అక్టోబర్ 07(రైట్స్ మీడియా): జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం కేంద్ర పరిశీలకులు డాక్టర్ భాగ్యజ్యోతి, తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు , తెలంగాణ రాష్ట్ర లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ రాజు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమీక్షా సమావేశం మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ అనిత మరియు సిబ్బందితో జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ మరియు నిర్మూలన కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఐ.డి.ఓ.సి లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో పాటు RBSK వైద్యాధికారులు మరియు వారి సిబ్బందికి కుష్ఠు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం, చర్మంపై కనిపించే అనుమానిత మచ్చలను పరిశీలించడం, అనుమానిత కేసులను గుర్తించి వైద్య పరీక్షలకు పంపించడం మరియు అవసరమైన చికిత్స అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక సమీక్షా సమావేశం

ప్రత్యేకంగా 5–18 సంవత్సరాల వయస్సు గల పాఠశాల విద్యార్థుల్లో కుష్ఠు వ్యాధి లక్షణాలను గుర్తించి, అనుమానిత కేసులను వెంటనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని RBSK సిబ్బందికి సూచించారు. అవసరమైన సందర్భాల్లో పిల్లల కుటుంబ సభ్యులను కూడా పరీక్షించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన చికిత్స అందించాలని తెలిపారు.

కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని డాక్టర్ జాన్ బాబు మరియు డాక్టర్ భాగ్యజ్యోతి తెలిపారు. జిల్లాలో కుష్ఠు వ్యాధి కేసులను సమర్థవంతంగా గుర్తించి, చికిత్స అందిస్తూ మహబూబాబాద్ జిల్లాను కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా కొనసాగించేందుకు అన్ని స్థాయిల ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజల్లో కుష్ఠు వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి అవసరమైన వైద్య మరియు ఆరోగ్య సేవలు అందించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ శిక్షణలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆర్.బి.ఎస్.కె వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక సమీక్షా సమావేశం
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక సమీక్షా సమావేశం