జీడబ్ల్యూఎంసీ (రైట్స్ మీడియా): గ్రేటర్ వరంగల్ నగరంలో తడి, పొడి చెత్తను వేరు చేసిన అనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, ఆస్కి ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్షించారు. వ్యర్థాల ప్రాసెసింగ్‌కు ఆధునిక విధానాలను అనుసరిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహేందర్, ఆస్కి ప్రతినిధి రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు.