Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

బాధితులకు ఎల్‌ఓసీ చెక్కులు అందజేసి, అండగా నిలిచిన ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

బాధితులకు ఎల్‌ఓసీ చెక్కులు అందజేసి, అండగా నిలిచిన ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు
Share Short Clip Download PDF

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఎల్‌ఓసీ చెక్కులను బాధితులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేసి అండగా నిలిచారు. వర్ధన్నపేట మండలం గుబ్బేట తండాకు చెందిన బానోత్ వెంకటరాం నాయక్ చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి రూ.3 లక్షల ఎల్‌ఓసీ చెక్కును, దమ్మన్నపేట గ్రామానికి చెందిన అంగడి నర్సమ్మకు 2.50లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా మంజూరు చేపించి బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రాలను బుధవారం రోజున హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ..

పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా ఎల్‌ఓసీలు మంజూరు చేస్తోంది. నియోజకవర్గంలో ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా నేరుగా నన్ను కలవండి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్యం అందేలా చూస్తా. ప్రజల ఆరోగ్యమే నా ప్రాధాన్యత అని అన్నారు. ఎల్‌ఓసీ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ 4,5వ వార్డులకు చెందిన నాయకులు కీమా నాయక్,రాజేందర్ నాయక్, మైబు, బిక్షపతి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు ఎల్‌ఓసీ చెక్కులు అందజేసి అండగా నిలిచిన ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు