కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం పరిశోధకులు అల్లం విజయ్ కుమార్ కు బుధవారం డాక్టరేట్ డిగ్రీ ప్రధానం జరిగినట్లు కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. విజయ్ కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ జి. బ్రహ్మేశ్వరి పర్యవేక్షణలో 'సింథసిస్ ఆఫ్ స్మాల్ హైబ్రిడ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లాసోన్ ఫర్ ఆంటీ క్యాన్సర్ ఎవల్యూవేషన్’ (Synthesis of Small Hybrid Molecules From Lawsone for Anticancer Evaluation”' అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు.
హనుమకొండ జిల్లా పరకాల మండలం మలకపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ ను పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అబినందించారు.
కెమిస్ట్రీలో విజయ్ కుమార్ కు డాక్టరేట్ ప్రధానం
-- కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్.