ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిలీఫ్ ఫిజియో థెరఫీ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫిజియో థెరఫీ క్లినిక్ వైద్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. క్లినిక్‌లోని వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఫిజియో థెరఫీ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడతూ...
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే నడుము నొప్పులు, మెడ నొప్పులు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఫిజియోథెరపీ వైద్యసేవలు స్థానికంగా అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. తక్కువ ఖర్చులోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, క్లినిక్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.