నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసిల్దార్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాలని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవాలని , రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అధికారులందరూ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
రామతీర్థం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం