నరసరావుపేట/పల్నాడు జిల్లా(రైట్స్ మీడియా): పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్
వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,
రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సంస్కృతి, ధర్మం, నైతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన బోధనలు సమాజంలో సత్యం, ధర్మం, మానవతా విలువలను పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.