Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రైతులకు సకాలంలో రుణాలు అందించి, రైతుల సేవలో ముందుండాలి..

⏩వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

రైతులకు సకాలంలో రుణాలు అందించి, రైతుల సేవలో ముందుండాలి..
Share Short Clip Download PDF

⏩వర్ధన్నపేట పిఎసిఎస్ నూతన చైర్మన్, డైరెక్టర్లకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

హనుమకొండలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట పిఎసిఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) నూతన చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి , డైరెక్టర్లను ఘనంగా సన్మానించి, నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ..

సహకార సంఘాలు రైతులకు వెన్నెముక లాంటివని, పిఎసిఎస్ ద్వారా రైతులకు సకాలంలో పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, నూతనంగా ఎన్నికైన పాలకవర్గం రైతుల నమ్మకాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. రైతుల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, నూతన డైరెక్టర్లు ఎమ్మెల్యే నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతి బానుప్రసాద్, మైనార్టీ రాష్ట్రా నాయకులు ఎండి. చోట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిదుముల్ల భాస్కర్, ల్యాబార్థి ఉపసర్పంచ్ గంగా రాజు, ఏం డి సోహెల్, విలసారాపు వెంకట్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు సకాలంలో రుణాలు అందించి రైతుల సేవలో ముందుండాలి