ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్, బీహార్‌లోని పాట్నాకు చెందిన ఆచార్య అనిల్ కుమార్ ఠాకూర్ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్‌లో నిర్వహించనున్న 109వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక జాతీయ సదస్సు నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థికశాస్త్ర విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల విభాగాల డీన్, దూరవిద్యా కేంద్రం సంచాలకులు, పాలకమండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్ తదితరులు పాల్గొన్నారు.