జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వివిధ శాఖల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులపై సమావేశంలో సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అనుమతులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.
TG-iPASS కింద వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన పలు పరిశ్రమల యూనిట్లకు కమిటీ ఆమోదం మంజూరు చేశారు. అలాగే T-PRIDE పథకం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సరకు రవాణా వాహనాలపై అందించే ప్రోత్సాహకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సమీక్షించింది. కమర్షియల్ టాక్స్ శాఖ స్క్రూటినీ అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు ప్రోత్సాహకాలు మంజూరు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ , జిల్లా రవాణా అధికారి జనార్దన్ రెడ్డి , ఎల్‌డీఎం విష్ణుప్రియ , కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్, ZM-IIC, కాలుష్య నియంత్రణ మండలి (PCB), విద్యుత్ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, కుడా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్‌వాటర్ శాఖ, DICCI ప్రతినిధులు సహా మొత్తం 15 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.