హైదరాబాద్ (రైట్స్ మీడియా): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన న్యాయవాదులకు సముచిత న్యాయం చేస్తామని, నామినేటెడ్ పదవుల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో శనివారం టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన ‘టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం’ జరిగింది.
ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, ఏఐపిసి చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.