హన్మకొండ(రైట్స్ మీడియా): బహుజన యోధుడు, వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హన్మకొండలోని కాకతీయ గౌడ హాస్టల్‌లో విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ ఓబీసీసెల్ జాతీయ కన్వీనర్ కత్తి వెంకటస్వామి గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాలను, బహుజనుల ఆత్మగౌరవం కోసం ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, సమాజ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు అనంతుల రమేష్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, మార్క రవి గౌడ్, కూనూరు రంజిత్ గౌడ్, డాక్టర్ సోల్తి కిరణ్ గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పులి శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ గౌడ్, మోహన్ గౌడ్, బొనగాని యాదగిరి గౌడ్, బైరి రవికృష్ణ గౌడ్, తీగల జీవన్ గౌడ్, స్వామి గౌడ్, యుగేందర్ గౌడ్, హరీష్ గౌడ్, జగన్ గౌడ్, మార్క విజయ్ గౌడ్, సంజయ్ గౌడ్, సోల్తి సారయ్య గౌడ్, ఏకాంతం గౌడ్, గోపి గౌడ్, రాంకీ గౌడ్, సాగర్ గౌడ్, విజయ్ గౌడ్, కుమార్ గౌడ్, తేజ, ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.