హనుమకొండ జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా కొనసాగాలని జిల్లా అదనపు కలెక్టర్ నెమురుగొమ్ముల రవి అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వేపై భూములు కొలతలు శాఖ అధికారులు, సర్వేయర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ నెమురుగొమ్ముల. రవి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో భూముల రీ సర్వే పై భూముల కొలతలు శాఖ అధికారులు, సర్వేయర్లతో సమీక్షా సమావేశం.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో ఏడు గ్రామాలలో రెండు సర్వే బృందాలతో పద్నాలుగు రోవర్లతో భూముల రీసర్వే కొనసాగాలని అన్నారు. గ్రామపాలన అధికారులు (జీపీవోలు)సర్వే జరుగుతున్న చోటకు రానట్లయితే సమాచారం ఇవ్వాలన్నారు. భూముల రీసర్వేలో జిల్లాకు, సర్వేయర్లకు మంచి పేరు ఉందని, ఇదే స్ఫూర్తితో రీ సర్వే కొనసాగిస్తూ నవంబర్ మాసానికి జిల్లాలోని డెబ్భై గ్రామాలలో పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో పరకాల ఆర్డీవో డిఎస్. వెంకన్న, భూములు కొలతలు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డీఐలు సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు పాల్గొన్నారు.