రోడ్డు భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ బుధవారం సంబంధిత శాఖల, క్షేత్రస్థాయి అధికారులతో కలిసి సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
వరంగల్ కొత్త బస్టాండ్ నిర్మాణం లో పనులను, రోడ్డులో ఏర్పాటుతున్నా నీటి నిలువలు,గుంతలు వలన ట్రాఫిక్ జామ్, రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. లక్ష్మీపురం మార్కెట్ పరిధిలోని రహదారుల పరిస్థితిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, నిర్ణీత ప్రమాణాలతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
క్షేత్ర స్థాయి పరిశీలనలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి ఎడి సర్వే ల్యాండ్ అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో వరంగల్ సుమ, ఆర్ అండ్ బి ఈఈ రాజేందర్, వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.