కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పశు సంపదను పెంపొందించడం మనందరి బాధ్యత
⏩ కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి.
ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి మాట్లాడుతూ..
వ్యవసాయ రంగమంతా యాంత్రీకరణ అయినందువలన పశువులను మనం నిర్లక్ష్యం చేస్తున్నామని, ఈ పద్ధతి విడనాడి ప్రతిరైతు పశుసంపదపై దృష్టిసారిస్తే సేంద్రియ ఎరువు లభించడంతోపాటు, మన ఆరోగ్యానికి అనువైన పంట ఉత్పత్తిని సాధించిన వాళ్ళమవుతామని, కావున పశు సంపద విషయంలో ప్రతి రైతు శ్రద్ధ తీసుకొని, పశు ఉత్పత్తిని పెంచాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లూరి శోభ శ్రీనివాసరావు, పాక్స్ చైర్మన్ పేరాల సంపత్ రావు, కార్యదర్శి జన్ను యాకయ్య, డైరెక్టర్లు వంటకాల అనిల్ రెడ్డి, సముద్రాల కృష్ణ, జనగాని శివకృష్ణ, గట్టు శ్రీధర్, ఉరుసు తిరుపతి, ఆకినపల్లి బిక్షపతి, కిన్నెర కృష్ణమూర్తి, మిల్కూరి శ్రీనివాస్, వెటర్నరీ మరియు మార్కెట్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లని సురేష్, పల్లె సంతోష్, అబ్బరవేణి అనిల్, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.