కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజ్జేపల్లి గ్రామంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. డీజే నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీస్ శాఖ సూచనలు మరియు నిబంధనలను ఇప్పటికే స్పష్టంగా తెలియజేసినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ Dhagad యూత్ ఆధ్వర్యంలో డీజే నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా డీజే యజమాని మరియు ఆపరేటర్ పై కేసు నమోదు చేసి, డీజేకు సంబంధించిన వాహనం మరియు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.
నిబంధనల ఉల్లంఘనకు డీజే నిర్వాహకులపై కేసు నమోదు: డీజే వాహనం, ఇతర సామగ్రి సీజ్..