నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించే మానసిక దివ్యాంగుల పాఠశాల తల్లిదండ్రుల సమావేశము ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ ముఖ్య అతిథిగా హాజరై తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. మానసిక దివ్యాంగులు తల్లిదండ్రులకు దేవుడిచ్చిన ప్రసాదమని వారిని జాగ్రత్తగా పెంచి, ఉపయోగకర పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మానసిక దివ్యాంగులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ(కీలకం)గా ఉంటుందని వారు సరైన దిశలో పిల్లల కోసం సమయాన్ని కేటాయించి, వారిని ప్రతిభ వంతుల పౌరులుగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి దివ్యాంగ పిల్లల సమస్యలను గుర్తించి వాటిని క్రమ పద్ధతిలో ఒక పేపర్ పై రాసుకొని వాటిలో చిన్న సమస్యలను ముందుగా తీసుకొని ఆ సమస్యలను దూరం చేయడంలో వారికి కావలసిన సహాయాన్ని అందించాలని తెలిపారు. దీనివల్ల పిల్లల్లో ప్రవర్తన పరమైన సమస్యలు దూరం అవుతాయని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లి వారి దివ్యాంగ పిల్లల కొరకు ABC పాటర్న్ లో ప్రవర్తనను మార్చవచ్చని చెప్పారు. పిల్లవాడు ప్రవర్తన కంటే ముందు జరిగిన అంశాలను మరియు ప్రవర్తన తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పిల్లలను పెంచుకోవాలని కోరారు.
మానసిక దివ్యాంగులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిదీ
⏩ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి ఎస్.సిద్దయ్య, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవి తేజ.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహ సొసైటీ కార్యదర్శి స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల కోసం అందిస్తున్న సేవలను మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేయవలసిన లోకల్ ప్రాజెక్ట్ కమిటీ యొక్క ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలలో మానసిక దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు పని చేస్తుందని తెలిపారు. పాత కమిటీలో బాబా గౌడ్ చైర్మన్ గా, జగదంబరావు వైస్ చైర్మన్ గా, ఎన్ లక్ష్మి టీచర్ కన్వీనర్ గా, పేరెంట్స్ సూర్య ప్రకాష్ మరియు ఆస్మాలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీకాలం ముగియడంతో నూతన కమిటీ సభ్యులుగా బ్రహ్మానంద రెడ్డి చైర్మన్ గా రామ్ సుజన్ వైస్ చైర్మన్ గా ఇంద్రాణి టీచర్ కన్వీనర్ గా పేరెంట్స్ భాగ్యలక్ష్మి మరియు బ్రహ్మయ్యలను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి మరియు మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి మరియు మానసిక దివ్యాంగుల తల్లిదండ్రులు, దివ్యాంగులు పాల్గొన్నారు.