Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

మాదకద్రవ్య రహిత భారతావని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ మోడ్ లో పనిచేయాల్సిన అవసరం ఉంది

⏩ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.

మాదకద్రవ్య రహిత భారతావని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ మోడ్ లో పనిచేయాల్సిన అవసరం ఉంది
Share Short Clip Download PDF

మాదకద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిషన్ మోడ్ లో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.

మాదకద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిషన్ మోడ్ లో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్న మూడో జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) అధిపతుల సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..

దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తోందన్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ (2026–29)’ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగించాలని సూచించారు.

‘ఏకీకృత సంకల్పం.. ఉమ్మడి బాధ్యత’(United Resolve, Shared Responsibility) అనే ప్రధాన ఉద్దేశంతో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొన్నారు.