హైదరాబాద్/హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి కబడ్డీ అకాడమీ మంజూరు కావడం పట్ల హుస్నాబాద్ క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కబడ్డీ అకాడమీ మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ కృష్ణను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి, ఘనంగా సత్కరించారు.