నిజామాబాద్(రైట్స్ మీడియా): పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ బోధన్, సిరికొండ, మరియు ఇతర పోలీస్ స్టేషన్లో పరిధిలో తెల్లవారుజామున నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారి ఇళ్లపై మరియు కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వడ్డీ వ్యాపారస్తుల వారిలో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు పోలీస్ కమిషనర్ అధికారికంగా వెలువరించే ఆస్కారం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదైనట్లు అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం పలు ఘటనలు చోటు చేసుకున్న విషయాలు మరియు పోలీస్ కమిషనర్ కు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొని దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

ఈ దాడులు పూర్తిస్థాయిలో నిరంతర ప్రక్రియగా జీరో వడ్డీ వ్యాపారం, అనాధికారికంగా ప్రైవేటుగా చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై, అలాగే కొన్నిచోట్ల వారి స్థిరాస్తుల పేపర్లను తాకట్టు తో పాటు మార్టిగేజ్ చేయించుకోని, వడ్డీలకు ఇస్తున్న వారిపై కూడా దాడులు నిర్వహించి కేసుల నమోదు తో పాటు కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కృషి చేస్తున్నట్టు తెలిసింది. అయితే పోలీసుల దాడులకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.