Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ప్రజాసేవ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయం

• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ప్రజాసేవ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
Share Short Clip Download PDF

హైదరాబాద్(రైట్స్ మీడియా): భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ ప్రజల్లో సేవా భావాన్ని, సామాజిక బాధ్యతను మరింత పెంపొందిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ అభియాన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని తార్నాక పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ విస్తృతంగా కొనసాగుతోందని వివరించారు.
ఈ ప్రచారంలో భాగంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా డ్రైవ్‌లు, శ్రమదానం మరియు పలు సేవా కార్యక్రమాలను తెలంగాణ అంతటా పార్టీ శ్రేణులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అందించిన ప్రజాసేవా స్ఫూర్తిని, పర్యావరణ స్పృహను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే లక్ష్యంగా బీజేపీ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ప్రజాసేవ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయం